సీపీఐ కార్యదర్శి చాడ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేల విడి చి సాము చేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సీఎం ఆలోచనలు ఆకాశంలో విహరిస్తున్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు 7, 8 స్థానాలు కూడా రావం టూ కించపరుస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్రం లో పాలన తీరుతో బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. గురువారం పార్టీ నాయకుడు అజీజ్‌పాషాతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ఆదాయ, వ్యయాలు, బడ్జెట్ వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, బడ్జెట్ ఫ్రీజింగ్‌తో బడుగు, బలహీనవర్గాల సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. అర్ధరాత్రి నోటిఫికేషన్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బ్రహ్మాండంగా ఉందని మిమ్మల్ని మీరే అభినందించుకుంటే దానిని అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమన్నారు.
కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారు
Published Fri, Oct 14 2016 4:12 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement