సీఎం కనుసన్నల్లో పోలీసు రాజ్యం: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పోలీసు రాజ్యం సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ నాయకురాలు పశ్యపద్మతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికే వన్నె తెచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం పట్ల పోలీసులు నిరంకుశంగా వ్యవహరిం చడం వెనుక సీఎం ఆదేశాలున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై చర్చించేం దుకు టీజేఏసీ, అన్ని రాజకీయపక్షాలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజల సొమ్ముకు కాపలాదారుడిగా ఉండాల్సిన సీఎం కేసీఆర్.. దేవుళ్లు, మొక్కుల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు.