ఏపీ హైకోర్టు లాయర్ల సంఘాధ్యక్షుడిగా చల్లా | Challa Dhananjaya is a leaders of AP High Court, Judiciary association cheaf | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు లాయర్ల సంఘాధ్యక్షుడిగా చల్లా

Published Sat, Apr 22 2017 1:16 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

ఏపీ హైకోర్టు లాయర్ల సంఘాధ్యక్షుడిగా చల్లా - Sakshi

ఏపీ హైకోర్టు లాయర్ల సంఘాధ్యక్షుడిగా చల్లా

ఉపాధ్యక్షుడిగా ఆనంద్‌ శేషు, కార్యదర్శులుగా జ్యోతిప్రసాద్, హనుమంతరావు  

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో చల్లా ధనుంజయ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కె.బి.రామన్నదొరపై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు. ధనుంజయకు 687 ఓట్లు రాగా, రామన్నదొరకు 682 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా గెలిచిన పోపూరి అనంద్‌శేషుకు 703 ఓట్లు వచ్చాయి. కార్యదర్శులుగా కె.జ్యోతి ప్రసాద్, బాచిన హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా వీరభద్ర రూపేశ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు.

కోశాధికారిగా పితాని చంద్రశేఖర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా రేటూరి అశోక్, కె.వి.డి.దివాకర్, సోమిశెట్టి గణేశ్‌బాబు, నరహరిశెట్టి మోహన్‌ వెంకటాచలం, ఎలిశెట్టి సోమరాజు, రేవూరి సుజన్‌కు మార్, ఓరుగంటి ఉదయకుమార్, పి.రామమూర్తి ఎన్నికయ్యారు. మరో నలుగురు కార్యవర్గ సభ్యులు మోహన్‌రామి రెడ్డి, కె.శ్రీనివాస్, కె.రాధిక, బేబీరాణి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement