జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు నుంచి 3 రోజుల్లోగా నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణకు ఒక రోజు గడువిచ్చింది. నోటిఫికేషన్ వెలుడేరోజు నుంచి 15వ రోజులోగా పోలింగ్ జరగనున్నట్లు వెల్లడించింది.
గతంలో నామినేషన్ల ఉపసంహరణ నుంచి పోలింగ్ తేదీకి కనీసం 12 రోజుల వ్యవధి ఉండేది. అయితే జనవరి 31లోగా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాలమేరకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెలలో ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా(ఫలితాలతో సహా) నిబంధనల్లో మార్పులు చేసింది.