
కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
కొరియోగ్రాఫర్ భరత్ తన గదిలో ఉరేసుకుని మరణించాడు.
ఓ టీవీ ఛానల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పనిచేసే.. కొరియోగ్రాఫర్ భరత్ తన గదిలో ఉరేసుకుని మరణించాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ లోని తన గదిలో.. శనివారం రాత్రి అందరూ నిద్రపోయాక.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. భరత్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి భరత్ సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజీల ఆధారంగా ఈ ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్న భరత్, ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.