ఎల్బీ నగర్ పరిధిలో పదోతరగతి చదువుతున్న ఓ అమ్మాయిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
రాష్ట్ర రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. అభం శుభం ఎరుగని చిన్నారులను కూడా కిరాతకులు వదలట్లేదు. ఎల్బీ నగర్ పరిధిలో పదోతరగతి చదువుతున్న ఓ అమ్మాయిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనస్థలిపురం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆ అమ్మాయి (17) రాజన్నగూడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటోంది. తెలిసిన బంధువుల వద్ద వదిలిపెట్టమన్నాడంటూ రాహుల్ అనే యువకుడు ఆమెను తన వాహనంపై తీసుకెళ్లాడు. తుర్కయాంజల్ ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రాహుల్ కోసం గాలిస్తున్నారు. రాహుల్ మీద కేసు నమోదైంది. అతడెవరో ఇంతవరకు తెలియలేదు.