class 10 student
-
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్‌కి వెళ్లి టీచర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ కీలకమైన అవయవాలకు తగలకపోవడం వల్ల ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్‌లోనే ఉన్నారు -
విడ్డూరం: 15ఏళ్ల బాలుడికి అన్నప్రాశన....
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పదో తరగతి బాలుడికి అన్నప్రాశన జరిగిందంటే నమ్మశక్యం కావడం లేదు కదా... కానీ ఇది నిజం.. పాతబస్తీలో ఆటో నడుపుకుని జీవనం కొనసాగించే సాబిర్ అనే వ్యక్తి కుమారుడు తన్వీర్. ఇతను బాల్యం నుంచి అన్నం తినడం లేదు. ఎవరైనా బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించినా వాంతికి చేసుకునే వాడు. కేవలం చాయ్‌బన్, బజ్జి, రొట్టె వంటి పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు బాలుని అలవాటు తెలుసుకుని బంధువులెవరూ ఇతనికి అన్నం పెట్టేవారు కాదు. చాయ్‌బన్‌తో ఆతిథ్యం ఇచ్చేవారు. బాలుడు ఎదిగే కొద్ది తల్లిదండ్రులకు ఆందోళన పడసాగారు. పదేళ్ల ప్రాయంలో సైక్రియాటిస్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. బలవంతంగా తినిపిస్తే వాంతికి చేసుకునేవాడు. ప్రస్తుతం బాలుడు పదోతరగతి పూర్తి చేసుకుని ఇంటర్లోకి వెళ్లాడు. ఇప్పటి వరకు అన్నం ముట్టలేదు. ఎలాగైనా అన్నం అలవాటు చేయాలని, లేని పక్షంలో బలహీనంగా అవుతాడని వైద్యులు పదేపదే హెచ్చరించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, మేనత్త బాలుడిని ఎన్‌పేటలోని సైక్రియాటిస్టు వైద్యురాలు డాక్టర్ జీవన వద్దకు తీసుకెళ్లారు. ఆ వైద్యురాలు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆతర్వాత కుటుంబ సమేతంగా సంతోష్‌నగర్‌లో ఉంటున్న బాలుని మేనత్త వద్దకు వెళ్లారు. మేనత్త బలవంతంగా అన్నం తినిపించింది. వాంతికి చేసుకుని కాసేపు ఇబ్బందిపడ్డాడు. అయినా భయపడలేదు. తల్లిదండ్రులు కూడా తినిపించసాగారు. ఆతర్వాత అన్నాన్ని జీర్ణించుకోగలిగాడు. ఇక తన్వీర్ అన్నం తింటున్నాడనే సమాచారం బంధువులందరికి తెలిసింది. దీంతో నానమ్మ, పెద్దమ్మలు అందరు కలిసి బుధవారం అతనికి పూలమాల వేసి సత్కరించారు. తలో ముద్ద అన్నం తినిపిస్తూ అన్నప్రాశన లాంటి కార్యక్రమం నిర్వహించారు. -
ఫేస్బుక్ మర్డర్
జడ్చర్ల: ఫేస్బుక్ కపట ప్రేమ మరోసారి పడగవిప్పింది. గుర్తు తెలియని వ్యక్తితో చేసిన చాటింగ్ ముదిరి.. జస్ట్ కలుద్దామని పిలవగానే వెళ్లడం ఓ అమ్మాయిని నిర్జీవంగా మార్చేసింది. పాలమూరు జిల్లా జడ్చర్ల శివారులో రెండ్రోజుల క్రితం జరిగిన దారుణ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల వాసులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రవిశంకర్, సురేఖ దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీ హర్షిణి, శ్రీమాన్విత. జిల్లా కేంద్రం సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో శ్రీహర్షిణి (15) పదో తరగతి, శ్రీమాన్విత ఆరోతరగతి చదువుతున్నారు. తండ్రి రవిశంకర్ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రవిశంకర్ కుటుంబం 25 ఏళ్ల క్రితమే జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిరపడింది. దుకాణానికి వెళ్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని తమ నివాసం నుంచి శ్రీహర్షిణి మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెన్ను, పెన్సిల్ కొనేందుకు జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన శ్రీహర్షిణి.. వెంటనే మళ్లీ ఏదో కొనాలని చెప్పి రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. దాదాపు గంటపాటు ఎదురుచూసిన తల్లి సురేఖ.. కూతురు ఇంటికి రాలేదంటూ భర్త రవిశంకర్‌కు ఫోన్ చేసింది. రవిశంకర్ వెంటనే ఇంటికొచ్చి చుట్టుపక్కల వారిని శ్రీహర్షిణి గురించి అడిగారు. ఆమెకు ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు. రాత్రి 7గంటల తరువాత ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి వెంటనే దర్యాప్తు చేపట్టారు. కారులో ఎక్కి వెళ్లిందన్న సమాచారంతో.. హౌసింగ్‌బోర్టు సమీపంలో ఓ కారులో శ్రీహర్షిణి ఎక్కి వెళ్లిందని.. తెలిసిన వారైనందునే ఆ కారులో వెళ్లి ఉంటుందని భావించినట్లు కొందరు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఆ కారు గుర్తులు అడిగి తెలుసుకుని సీసీ కెమెరాల పుటేజీలని పరిశీలించారు. బాలానగర్ సమీపంలోని టోల్‌ప్లాజా దగ్గర జడ్చర్ల వైపు వచ్చి కేవలం అరగంటలోపే మళ్లీ హైదరాబాద్ వైపు ఆ కారు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబరును సేకరించి రవాణా శాఖ అధికారుల సహకారంతో కారు యజమాని చిరునామాను సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి పట్టివేత ఈ మేరకు కారు యజమాని తన కారును తీసుకెళ్లిన యువకుడి సమాచారం పోలీసులకు ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలం కోహెడకి చెందిన ఏనుగు నవీన్‌రెడ్డి (28)ని పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు హైదరాబాద్‌లోని వీల్ అలైన్మెంట్ దుకాణంలో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నవీన్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన సమాచారంతోనే శ్రీహర్షిణి హత్య వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించగా.. గురువారం తెల్లవారుజామున శ్రీహర్షిణిని చంపేసినట్లు చెప్పాడు. ఈ సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు శ్రీహర్షిణి మృతదేహాన్ని గుర్తించారు. జడ్చర్ల శివారులోని శంకరాయపల్లితండాకు వెళ్లే రహదారికి కొద్దిదూరంలో ఉన్న గుట్ట పక్కన గడ్డిపొదల మాటున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే! పెద్దగా చదువుకోని నవీన్‌రెడ్డి ఫేస్బుక్లో జడ్చర్లకు చెందిన శ్రీహర్షిణితో మూడు నెలలుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. వీరిస్నేహం కాస్త ముదరడంతో తరచూ వాట్సప్, ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకునేవారని సమాచారం. కొంతచనువు ఏర్పడడంతో నవీన్‌రెడ్డి మంగళవారం కారులో జడ్చర్లకు వచ్చి శ్రీహర్షిణి కలిశాడు. హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలోనే ప్రధాన రహదారిపైకి వచ్చిన శ్రీ హర్షిణిని నవీన్‌రెడ్డి కారులో ఎక్కించుకుని శంకరయాపల్లి తండా రహదారి వైపు వెళ్లారు. అక్కడ నిర్జన ప్రదేశంలో వారు కాసేపు మాట్లాడిన తరువాత శారీరకంగా తనతో కలవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో తనకు ఇష్టంలేదని, తనను వదిలేయాలని శ్రీ హర్షిణి చెప్పింది. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తే క్రమంలో నవీన్‌రెడ్డి శ్రీహర్షిణి డ్రెస్సును పట్టి లాగడంతో దుస్తులు చిరిగిపోయాయి. ఈ క్రమంలో శ్రీహర్షిణిని గట్టిగా వెనక్కి నెట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న బండరాయిని తలపై పడేసిన నవీన్‌రెడ్డి వెంటనే కారులో హైదరాబాద్‌కి వెళ్లిపోయాడు. ఉరిశిక్ష విధించాలి విద్యార్థినిని దారుణంగా హత్యచేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని విద్యార్థి, మహిళా సంఘాలు, యువకులు, రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వరంగల్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష అమలు చేశారో అదే ఉరిశిక్షను ఇక్కడి హంతకుడు నవీన్‌రెడ్డికి విధించాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక తరగతులేవీ?
ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల చదువుపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా నిర్వహించే ప్రత్యేక తరగతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలను ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేలిగ్గా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 241, మోడల్ స్కూళ్లు 9 ఉండగా.. వీటిలో సుమారు 16 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే టెన్త్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చేయడమే ప్రత్యేక తరగతుల ఉద్దేశం. అయితే, గతేడాది ఆగస్టులోనే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఈ ఏడాది జిల్లా విద్యాశాఖాధికారి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజూ టీచర్లు బోధించిన సబ్జెక్టు, అంశాలు, హాజరైన విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా రిజిస్ట్రర్ కూడా నిర్వహించాలి. ఈమేరకు జూలై నెలాఖరులో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి ఈమేరకు చెప్పినట్లు సమాచారం. అధికారికంగా ఎటువంటి సర్క్యులర్ జారీ చేయలేదు. దీన్ని ఆయా హెచ్ఎంలు తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సింహభాగం పాఠశాలల్లో తూతూ మంత్రంగా తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒక్కపూటకే ప్రత్యేక తరగతులు పరిమితం అయ్యాయి. దీంతో పాటు రికార్డుల నిర్వహణను విస్మరించారు. తరగతుల నిర్వహణపై ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇన్చార్జి ఎంఈఓలు ఉన్నా.. ఆ బాధ్యతలు వారికి అప్పగించ లేదని సమాచారం. దీంతో వారూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా దిక్సూచి లేని ప్రయాణంలా ప్రత్యేక తరగుతులు కొనసాగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్ 60 శాతమే.. ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి బోధన అరకొరగానే జరుగుతోంది. పలు అడ్డంకులు ఎదురవడంతో బోధన వెనుకబడింది. వేసవి సెలవుల అనంతరం జూన్ ఒకటిన పాఠశాలలు పునఃప్రారంభమవగా.. కొన్ని రోజుల పాటు టీచర్లు బడి బాట కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారు. అనంతరం అదే నెల 6న టీచర్ల బదిలీల ఉత్తర్వులు వెలువడడంతో... ఉపాధ్యాయులంతా అదే చర్చలో పడ్డారు. బదిలీల ప్రక్రియ జులై 15న ముగిసింది. ఇలా దాదాపు నెలన్నర సమయం వృథా అయింది. ఈ ప్రభావం బోధనపై పడింది. వచ్చేనెల ఒకటి నుంచి 8 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం –1 (ఎస్ఏ) పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటిరవకు లక్షిత సిలబస్‌లో 60 శాతం పాఠ్యాంశాల బోధన మాత్రమే పూర్తయింది. మరో పది రోజుల్లో మిగిలిన 40 శాతం సిలబస్ పూర్తి కావడం కష్టమే. ఆ తర్వాత వచ్చేనెల 9 నుంచి 21వరకు దసరా సెలవులు. ఇలా పుణ్య కాలమంతా గడుస్తున్నా యంత్రాంగం పకడ్బందీగా పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణలో విఫలమవుతున్నారు. ఈ విషయమై డీఈఓ కె.సత్యనారాయణ రెడ్డి వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. గణితం, సైన్స్‌లోనే అధికంగా> ఫెయిల్.. గతేడాది ఆగస్టు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. పదో తరగతి ఫలితాల్లో జిల్లా 87.13 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో జిల్లా నిలిచింది. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల్లో అధిక శాతం మంది గణితం, సైన్స్‌లోనే తప్పారు. సగటున మ్యాథ్స్‌లో 10 శాతం, సైన్స్‌లో ఏడు శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈమేరకు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఆరు నెలలు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఆ స్థాయిలో ఫెయిలవడం గమనార్హం. ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఇప్పటికైనా విద్యాశాఖ మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
విద్యార్థిని చితకబాదిన టీచర్..వీడియో వైరల్
-
పోస్టింగ్ అందుకోవలసిన వేళ.. పోలీస్ స్టేషన్‌కి
జైపూర్ : పోస్టింగ్ ఆర్డర్ అందుకోవలసిన సమయంలో ఆ ఉపాధ్యాయుడు అనూహ్యరీతిలో పోలీస్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. వివరాల ప్రకారం... రాజస్తాన్ దౌసా జిల్లాకు చెందిన జగ్మోహన్ మీనా అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన దివానా గ్రామంలోని స్వామి వివేకానంద మోడల్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల (శనివారం) క్రితం అదే పాఠశాలలో చదువుతున్న ఒక పదోతరగతి విద్యార్థి మీద చేయి చేసుకున్నాడు. అయితే జగ్ మోహన్ విద్యార్థిని కొడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తోంది. అంతేకాక విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం జగ్మోహన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సోమవారం (నేడు) పోస్టింగ్ ఆర్డర్ అందుకోవాల్సిన వ్యక్తి కాస్తా పోలీసు విచారణ ఎదుర్కోబోతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లాల్సోట్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర కుమార్ జగ్మోహన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కారణాల వల్ల ఉపాధ్యాయుడు పిల్లవాడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేంద్ర కుమార్ తెలిపారు. జగ్మోహన్ విద్యార్థిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారులు అతని పోస్టింగ్ ఆర్డర్‌ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. విచారణ అనంతరం జగ్ మోహన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అన్నయ్య కోసం తమ్ముడి ఆరాటం
లక్నో : తన అన్నయ్యకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక ఓ పదో తరగతి విద్యార్థి ఏకంగా డీజీపీ పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా తెరిచాడు. అంతేకాదు ట్విటర్ ద్వారా డీజీపీ ఇచ్చినట్టుగా ఆదేశాలు పంపించి పోలీసులతో తన పని చేయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఈ ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాజ్‌గంజ్‌కు చెందిన సాదిక్ అన్సారీ అనే వ్యక్తి బాలుడి సోదరుని నుంచి రూ. 45 వేలు అప్పుగా తీసుకున్నాడు. బదులుగా తన సోదరునికి దుబాయ్‌లో ఉపాధి చూపిస్తానని చెప్పాడు. కానీ అన్సారీ బాలుడి కుటుంబాన్ని మోసం చేయడంతో వారు గుల్హారీ బజార్ పోలీస్ స్టేషన్లో అతడి మీద ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ బాలుడు యూపీ డీజీపీ ఓపీ సింగ్ పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాను తెరిచాడు. అనంతరం ఆ ట్విటర్ అకౌంట్ నుంచి విచారణను వేగవంతం చేయాలని గోరఖ్‌పూర్ ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీ చేశాడు. డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయనుకుని పోలీసులు తక్షణం స్పందించారు. సాదిక్ అన్సారీ నుంచి బాలుడి సోదరుడికి 30 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మిగతా డబ్బు త్వరలోనే తిరిగిస్తానని అతడితో హామీ యిప్పించారు. కేసు పరిష్కరమైనట్టు డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని డీజీపీ ఆఫీసు నుంచి సమాధానం వచ్చింది. దీంతో కూపీ లాగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. నకిలీ ట్విటర్ ఖాతా తెరిచిన బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, గ్రామంలోని తన స్నేహితుని సహాయంతో తాను ఇదంతా చేసినట్టు అతడు ఒప్పుకున్నట్టు సైబర్ సెల్ ఇన్సెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. బాలుడి భవిష్యత్తును పాడు చేయకూడదన్న ఉద్దేశంతో కేసు నమోదు చేయలేదని, గట్టిగా హెచ్చరించి వదిలేసినట్టు చెప్పారు. -
పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
-
పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
ప్రేమ పేరుతో వలవేసి.. పదో తరగతి చదివే విద్యార్థినిని లోబర్చుకుని ఆమెపై అత్యాచారం చేశాడో కీచక ఉపాధ్యాయుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఇంగ్లిషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నెల్లూరు నాగేశ్వర రావు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)తో ప్రేమయాణం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను పలుమార్లు హెచ్చరించినా ఆమె మారలేదు. రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపు నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఒక లాడ్జిపై పోలీసులు దాడి చేయగా, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే, అతడితో పాటు మైనర్ అమ్మాయి ఉండటంతో పోలీసులు విచారించగా అసలు విషయం తెలిసింది. వీళ్లిద్దరూ గతంలో కూడా ఇదే లాడ్జికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో లోబర్చుకున్న నాగేశ్వరరావు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాయమాటలు చెప్పి తన కూతురును లొంగదీసుకున్నాడంటూ విద్యార్థిని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నెల్లూరు నాగేశ్వరరావుకు గతంలోనే పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
పాఠశాలలో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని
-
శిశువుని ప్రసవించిన గురుకుల పాఠశాల విద్యార్థిని
నిజామాబాద్ జిల్లా పిట్లం కస్తూర్బా గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో టెన్త్ విద్యార్థిని ప్రసవించింది. దాంతో ఆ శిశువును విద్యార్థిని బంధువులు గత అర్థరాత్రి ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. ఆ శిశువు ఏడుపు విని స్థానికులు వెంటనే స్పందించారు. శిశువును ఆసుపత్రికి తరలించారు. -
పదో తరగతి బాలిక పై అత్యాచారం
-
పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారం
రాష్ట్ర రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. అభం శుభం ఎరుగని చిన్నారులను కూడా కిరాతకులు వదలట్లేదు. ఎల్బీ నగర్ పరిధిలో పదోతరగతి చదువుతున్న ఓ అమ్మాయిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనస్థలిపురం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి (17) రాజన్నగూడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటోంది. తెలిసిన బంధువుల వద్ద వదిలిపెట్టమన్నాడంటూ రాహుల్ అనే యువకుడు ఆమెను తన వాహనంపై తీసుకెళ్లాడు. తుర్కయాంజల్ ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రాహుల్ కోసం గాలిస్తున్నారు. రాహుల్ మీద కేసు నమోదైంది. అతడెవరో ఇంతవరకు తెలియలేదు. -
కాలువలో శవమై తేలిన పదోతరగతి విద్యార్థిని
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియాంక అనే పదో తరగతి విద్యార్థిని కాలువలో శవంగా తేలింది. ఈనెల 19వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పాలకొల్లులోని ఇబ్రహిల్ ఎయిడెడ్ పాఠశాలలో ప్రియాంక పదో తరగతి చదువుతోంది. ఈ దారుణ సంఘటనపై స్పందించిన పోలీసులు ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్‌తో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా విచారణ చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ ఆదేశించారు.