'ఏపీ సచివాలయం అప్పగించాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంను తమకు అప్పగించాలంటూ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కోరారు. రాజ్భవన్లో గవర్నర్తో సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం భేటీయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ సచివాలయంను తెలంగాణకు అప్పగించే విషయంపై కేబినేట్ చేసిన తీర్మానాన్ని కేసీఆర్ గవర్నర్కు అందజేశారు. ఇప్పటికే ఏపీలోని శాఖలన్నీ అమరావతికి తరలివెళ్లినందున వీలైనంత త్వరగా ఏపీ సచివాలయంను అప్పగించాలని కోరారు. అనంతరం కొత్త సచివాలయం పనులు ప్రారంభిస్తామని సీఎం గవర్నర్కు తెలిపారు.