హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో శనివారం భేటీ అయ్యారు. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు పరిణామాలపై గత కొంత కాలంగా రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో నెలకొన్న న్యాయ సమస్యలతో పాటు హైకోర్టు విభజన వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.