
సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను వైద్యులు పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పారు.
దీంతో ముఖ్యమంత్రి మూడు రోజులపాటు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకోవాల్సి వచ్చింది. ఈ మూడు రోజులూ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు.