త్వరలో జరగబోయే మేడిగడ్డ బ్యారేజి శంకుస్థాపనకు మహారాష్ట్ర సీఎం దేవింద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: త్వరలో జరగబోయే మేడిగడ్డ బ్యారేజి శంకుస్థాపనకు మహారాష్ట్ర సీఎం దేవింద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసులో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమైయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వరంగల్, కరీంనగర్‌లు గోదావరి జిల్లాల్లా మారుతాయని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్పీకి కూడా మేడిగడ్డ నుంచి నీరు అందుతుందని కేసీఆర్ తెలిపారు.