పెట్టుబడులతో రాష్ట్రానికి రండి! | Come to the state with investments! | Sakshi
Sakshi News home page

పెట్టుబడులతో రాష్ట్రానికి రండి!

Published Fri, May 26 2017 2:26 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

పెట్టుబడులతో రాష్ట్రానికి రండి! - Sakshi

పెట్టుబడులతో రాష్ట్రానికి రండి!

- దిగ్గజ కంపెనీలకు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం 
సిలికాన్‌వ్యాలీలో బిజీ బిజీ 
ఐటీ కంపెనీలతో భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్, ఆపిల్‌ వంటి సంస్థలు ఇప్పటికే అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నాయని, ఇంటెల్‌ లాంటి దిగ్గజ కంపెనీకి నగరం సరైనదని పరి శ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు చెప్పారు. పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ఇంటెల్‌ గ్రూపును ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ గురువారం సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ పరి శ్రమలు, ఐటీ కంపెనీలతో సమావేశ మ య్యా రు. హైదరాబాద్‌ నగరాభివృద్ధి, అందు బాటు లో ఉన్న వనరులను వారికి వివరించారు. తొలుత ఆయన ఇంటెల్‌ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు (మాన్యూ ఫ్యాక్చ రింగ్, ఆపరేషన్స్, సేల్స్‌) స్టాసీ స్మిత్, కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాబర్ట్‌ హెచ్‌ స్వాన్‌తో చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రగతి, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు, నిపుణులైన మానవ వన రుల లభ్యత, విద్యా సంస్థల గురించి వారికి వివరించారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్ర మానికి కేంద్రం ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యం లో భారత్‌లో ఇంటెల్‌ కంపెనీ విస్తరణ ప్రణా ళికల్లో తెలంగాణను పరిశీలించాలని కోరారు. 
 
తెలంగాణలో నెట్‌ ట్రాకర్‌ ల్యాబ్‌... 
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ల్లో ఒకటైన ఫ్లెక్స్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు డగ్‌ బ్రిట్‌తో   కేటీఆర్‌ సమావేశమై రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టాలని ఆహ్వానించారు. పెట్టుబడు లతో ముందుకు వస్తే సంపూర్ణ సహాయ సహ కారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌ లో ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల ఉత్పత్తు ల పార్కులో ఫ్లెక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. డగ్‌ బ్రిట్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో తమ కంపెనీ విస్తరణ అవకాశాలను పరిశీలిస్తామన్నారు.  తెలంగాణ లాంటి రాష్ట్రాలు పరిశ్రమలకు  ఊతం ఇచ్చేలా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ–వర్క్స్‌ ప్రాజెక్టుతో కలసి పని చేస్తామ న్నారు. తమ అనుబంధ కంపెనీ నెట్‌ ట్రాకర్‌ ల్యాబ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని,  పీవీ, సోలార్, స్టోరేజ్‌ రంగాల్లో  ఉత్పత్తుల తయారీ, డిజైన్‌పై పనిచేస్తామన్నారు. 
 
‘డేటా అనలిటిక్స్‌’లో భాగస్వాములుకండి
ప్రైవేటు రంగాల్లోనూ బిగ్‌ డేటాకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆధ్వ ర్యంలో డేటా అనలిటిక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావా లని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ క్లౌడ్‌ ఎరాను కేటీఆర్‌ ఆహ్వానించారు. ఓపెన్‌ డేటా పాలసీ లో విభాగంగా ఇప్పటికే ఒక వెబ్‌సైట్‌ ప్రారం భించామని, క్లౌడ్‌ ఎరా తరఫున సెం టర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. క్లౌడ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డానియల్‌ స్టూమ్రాన్‌ తో సమావేశమై క్లౌడ్‌ కంప్యూ టింగ్, బిగ్‌ డేటా రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. సిలికాన్‌ వ్యాలీలో గ్లోబల్‌ ఫౌం డ్రీస్‌ సీఈవో సంజయ్‌ ఝా, ప్రముఖ వెంచర్‌ కాపిటలిస్టు రాంశ్రీరాంతో సమావేశమై టీ–హబ్‌ ప్రాజెక్టు గురించి వివరించారు. సెప్టెంబర్‌లో టీ–హబ్‌ ను సందర్శిస్తామని శ్రీరాం హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement