
ప్రభుత్వమా.. చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడా?
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగితే వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అంగన్ వాడీల పట్ల టీడీపీ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళనలో పాల్గొన్న అంగన్ వాడీల తొలగింపు జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చి... ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని నిలబెట్టుకోవాలని శైలజానాథ్ సూచించారు.