జూలై 15 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు | Constable tests start from 15th july | Sakshi
Sakshi News home page

జూలై 15 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు

Published Thu, Jul 7 2016 7:39 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable tests start from 15th july

హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తేదీలు ఖరారు చేసింది. ఈ నెల 15 నుంచి ఆగష్టు 6 వరకు అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణ చంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్పీఎఫ్, ఫైర్‌మన్ విభాగాలలో అర్హత సాధించిన 1,92,588 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా కమ్యూనికేషన్ విభాగంలో అర్హత సాధించిన 27,410 మంది కోసం 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ ఈవెంట్స్ కోసం సమాచార లేఖలను బోర్డు రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నెంబర్‌ను పొందుపరిస్తే సమచార లేఖలు ప్రత్యక్షమవుతాయి. వీటిలో పేర్కొన్న విధంగా కేటాయించిన సమయానికి అందుబాటులో ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. అలాగే అభ్యర్థులందరూ కచ్చితంగా ఈవెంట్స్‌కు వచ్చేటప్పుడు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీలను తీసుకురావాలని పేర్కొంది. ఈవెంట్స్ లెటర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో ఏమైనా అనుమానాలుంటే 040-23150362, 040-23150462 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement