
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : చాడ
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఎంసెట్‌ను మళ్లీ నిర్వహించే విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. జాతీయస్థాయి నీట్ పరీక్ష వ్యవహారంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభుత్వం చివరివరకు గందరగోళానికి గురిచేసిందని పేర్కొన్నారు. తాజాగా ఎంసెట్ పేపర్ లీకేజీ ఆందోళనను కలిగిస్తోందని పేర్కొన్నారు.