Eamcet leakage
-
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో వంద కోట్ల కుంభకోణం
-
ఎంసెట్ లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల హస్తం
-
చివరి దశకు ‘ఎంసెట్’ లీకేజీ దర్యాప్తు
- విచారణకోసం నేడు ఢిల్లీకి సీఐడీ అదనపు డీజీపీ - ప్రింటింగ్ ప్రెస్, జేఎన్టీయూ లింకుపై దృష్టి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు చివరి మజిలీకి చేరింది. ఇప్పటివరకు 81మందిని కటకటాల్లోకి నెట్టిన సీఐడీ అధికారులు ఇప్పుడు అసలు లింకును ఛేదించే పనిలో పడ్డారు. తాజాగా వారు ప్రింటింగ్ ప్రెస్–జేఎన్టీయూ లింకుపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ప్రెస్ యజమానిని విచారించేందుకు నేరుగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ రంగంలోకి దిగారు. రెండింటి పాత్ర బయటపడాలి... ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అటు ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు ఇటు జేఎన్టీయూ పాత్రపై విచారణ జరిపేందుకు మంగళవారం సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌తో పాటు దర్యాప్తు అధికారి ప్రకాశ్ జాదవ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రావత్, ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాన్ని ఎలా బయటకు తెచ్చాడన్న అంశంపై దృష్టిసారించారు. మరో పక్క అనుమానాస్పద స్థితిలో రావత్ మృతిచెందడంపై కూడా ఆరా తీయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వివిధ రాష్ట్రాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి 11 సార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇందులో యాజమాన్యం పాత్రను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఇన్నిసార్లు ప్రశ్నపత్రం లీకవుతున్నా జేఎన్టీయూ అధికారులు ఎందుకు ఇదే ప్రింటింగ్ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పగించారన్న దానిపై కూడా వారు ఆరా తీయనున్నారు. ఫినిషింగ్ టచ్‌పై ఉత్కంఠ... ఎంసెట్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ముసాయిదా చార్జిషీట్‌ను సిద్ధంచేశారని సమాచారం. అయితే అసలు లింకులు తేలకుండా చార్జిషీట్ వేస్తే నిందితులు సులువుగా తప్పించుకుంటారని న్యాయసలహా రావడంతో అధికారులు పునరాలోచిస్తున్నారు. దీనితో అసలు ఈ కేసులో చివరి మలుపు ఎలా ఉంటుంది? జేఎన్టీయూలో ఏ అధికారి పాత్రను చార్జిషీట్లో పేర్కొంటారు? ప్రింటింగ్ ప్రెస్ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోని అధికారులపై చర్యలుంటాయా? అన్న పలు అంశాలపై ఉత్కంఠ నెలకొంది. -
జేఎన్టీయూ నిర్లక్ష్యం కూడా కారణమే!
ఎంసెట్ లీకేజీపై చార్జిషీట్లో పేర్కొననున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జేఎన్టీయూ నిర్లక్ష్యం కచ్చితంగా ఉందంటూ సీఐడీ చార్జిషీట్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉన్న ఎంసెట్ ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌లో నిర్లక్ష్యం బయటపడిందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్టు కేసులున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా అదే ప్రింటింగ్ ప్రెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై చార్జిషీట్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 ప్రశ్నపత్రాలు లీకైన దాఖలాలను తెలుసుకోకుండా ఏళ్లకేళ్లుగా అదే ప్రింటింగ్ ప్రెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న కారణాలను సైతం సీఐడీ అధికారులు చార్జిషీట్లో పేర్కొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, జేఎన్టీయూ వ్యవహారంపై విచారణ జరిపామని, నిందితులతో ఎక్కడా సంబంధా లున్నట్టు ఆధారాల్లేవని సీఐడీ చార్జిషీట్లో స్పష్టం చేయనుంది. అధికారుల పాత్ర పైనా తాము విచారణ జరిపామని, నిందితులతో గతంలో కూడా ఎలాంటి సంబంధాలున్నట్టు బయటపడలేదని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ వారంలో ఎంసెట్ లీకేజీపై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్
హైదరాబాద్: ఎంసెట్ లీకేజి వ్యవహారంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సోమవారం ఎంసెట్ లీకేజీ అంశం చర్చకు రాగా ఆ విషయంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తీసుకుందని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ లేదా న్యాయవిచారణ జరిపించాలని కోరారు. అనంతరం మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ... దీనిపై ప్రాథమిక విచారణలో నిజమని తేలిన వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 49 మందిని అరెస్టు చేసి, రూ. 2.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను తప్పకుండా పట్టుకుంటామన్నారు. 2010, 2012లలో జరిగిన లీకేజీల నిందితులే ఇందులోనూ ఉన్నారని చెప్పారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ పక్షం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయారు. -
మెడికల్ ప్రవేశాలకు 7 వరకు గడువు
- తెలంగాణ విజ్ఞప్తి మేరకు సడలింపునిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం - నేడు మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వచ్చే నెల 7వ తేదీ నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ, తిరిగి పరీక్షలు నిర్వహించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆల స్యమైంది. దీంతో ప్రవేశాల గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ కూడా తమ రాష్ట్రంలోనూ గడువు పొడిగించాలని మరో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, ప్రవేశాలకు నెల రోజులు గడువు పొడిగించాలని తెలంగాణ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇరు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్లకు హాజరయ్యే అవకాశమున్నందున.. ఏపీలోనూ గడువు పొడిగించాలని ఆ రాష్ట్ర న్యాయవాది అభ్యర్థించారు. ప్రవేశాల గడువు పొడిగించేందుకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అభ్యంతరం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం... మెడికల్ ప్రవేశాల గడువును అక్టోబర్ 7లోగా పూర్తి చేసుకోవచ్చని సూచించింది. ఇక ఏపీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందేందుకు అవకాశం కల్పించే ఓపెన్ కోటా సీట్ల భర్తీకి మాత్రం 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే ఏపీలో మెడికల్ కాలేజీల్లోని ఓపెన్ కోటా సీట్లలో ప్రవేశాలకు మాత్రమే ఈ గడువు వర్తిస్తుంది. నేడు మూడో కౌన్సెలింగ్ తెలంగాణలో ఇప్పటికే రెండు విడతల మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు బుధవారం వారికి కేటాయించిన కాలేజీల్లో చేరారు. ఇంకా ఎవరైనా చేరకపోతే ఖాళీగా ఉండిపోయే సీట్లు, కొత్తగా అనుమతి వచ్చిన మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీలోని 75 కన్వీనర్ కోటా సీట్లకు గురువారం మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించి, శుక్రవారం సీట్లు కేటాయిస్తామని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీలో మిగిలిన సీట్లకు, మల్లారెడ్డి కాలేజీలోని బీ కేటగిరీ సీట్లకు 30వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
ఎంసెట్ లీకేజీ.. సీఐడీ డీఎస్పీ సస్పెన్షన్
వరంగల్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో లొసుగులు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో సీఐడీ డీఎస్పీపై వేటు పడింది. విజయవాడలో ఓ బ్రోకర్ వద్ద రూ. లక్షా 50 వేలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సీఐడీ డీఎస్పీని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. -
ఎంసెట్ లీకులో మంత్రులను బర్తరఫ్ చేయండి
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన టీపీసీసీ బృందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ నిర్బంధం, ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రెండు వేర్వేరు వినతిపత్రాలను సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి, మాజీ ఎంపీ ప్రభాకర్, టీపీసీసీ కిసాన్‌సెల్ నాయకుడు ఎం.కోదండ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేవిధంగా ఎంసెట్ ప్రశ్నపత్రాల లీక్ జరిగిందన్నారు. విద్య, వైద్య శాఖ మంత్రులతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను బర్తరఫ్ చేసి, పారదర్శకంగా విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ రంగసంస్థలకు కాకుండా బ్లాక్‌లిస్టులో ఉన్న ఒక ప్రైవేటు సంస్థకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను సందర్శిస్తామంటే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో పెడుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రైతు సంఘాల నేతలను, ప్రజా సంఘాల నేతలను, జేఏసీ నేతలను కూడా అరెస్టు చేసి జైళ్లలో పెడుతూ, పాశవిక పాలన చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియోజకవర్గంలోనూ పర్యటించనీయకుండా పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదన్నారు. వీటిపై గవర్నర్ స్పందించి, తగిన చర్యలను తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎంసెట్ అక్రమాలపై లోతైన విచారణ
– సెప్టెంబర్ 17 అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడి పండగలను మాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్షరాసి ర్యాంకులు లె చ్చుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 అంశాన్ని భారతప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉండగా యూనివర్సిటీలకు ప్రత్యేక జీఓ ద్వారా వీసీలను నియమించడం చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో తెలంగాణకు తలవంపులు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం అసమర్థత వల్లే ఎంసెట్ లీకేజీ
టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్య జడ్చర్ల టౌన్: సీఎం కేసీఆర్ అసమర్థత పాలన కారణంగానే ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మరణాలు, సరోజినదేవీ కంటి ఆస్పత్రిలో కళ్లు పోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. సోమవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ ద్వారా 56వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే గతంలో 85సార్లు లీకేజీ అయ్యాయని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోగులు పిట్టల్లా రాలిపోతుంటే అవి సహజ మరణాలు చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. గాల్లో దీపం పెట్టి దేవుడా..నీవే దిక్కు అనే చందంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని రమణ విమర్శించారు. ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సంపన్నరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రతిపక్షాలు, మేధావుల సలహాలు తీసుకోవాలని హితవుపలికారు. జిల్లా మంత్రులు పాలన వదిలేసి టీడీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. కాకతీయల కాలం నాటి చెరువులకు కల్వకుంట్ల మరమ్మతులు అంటూ ఎద్దేవాచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మున్నాభాయ్‌లెందరు?
► ఎంసెట్ ర్యాంకులను జల్లెడ పడుతున్న సీఐడీ ► విద్యార్థులు ‘శిక్షణ’ పొందిన కేంద్రాల్లోని సీసీ ఫుటేజీల స్వాధీనం ►నౌషాద్ అలీ, గుడ్డూ ఆచూకీకి దుబాయ్ పోలీసులతో సంప్రదింపులు హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీతో మొత్తంగా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందారన్న అంశంపై సీఐడీ దృష్టి సారిస్తోంది. ఎంసెట్-1, ఎంసెట్-2లో ఐదు వేల ర్యాంకుల వరకు జల్లెడ పడుతోంది. ఈ మేరకు జేఎన్టీయూ నుంచి ర్యాంకర్ల వివరాలను తీసుకుంది. రెండు సెట్లలో వచ్చిన ర్యాంకులను పోల్చి చూస్తోంది. ఒకదానికొకటి పొంతన లేనంతగా ర్యాంకులు ఎవరెవరికి వచ్చాయనే విషయాన్ని ఆరా తీస్తోంది. ఐదు ప్రత్యేక బృందాలు ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు ఐదు నగరాల్లో ‘ప్రత్యేక శిక్షణ’ పొందినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. మరిన్ని ఆధారాల కోసం బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుంది. ఎంసెట్-1, ఎంసెట్-2లలో ర్యాంకుల్లో వ్యత్యాసం వచ్చిన వారు ఈ సీసీ పుటేజీలో ఉన్నారా అన్న కోణంలో ఆరా తీయనుంది. ఫుటేజీలు, విమాన టికెట్లు, ర్యాంకుల్లో వ్యత్యాసం వంటివి కోర్టులో కేసుకు బలమైన ఆధారాలుగా మార్చుకోవచ్చని సీఐడీ భావిస్తోంది. దళారులపై వల ఎంసెట్-2లో దళారులు ఎందరున్నారన్న అంశంపై సీఐడీ దృష్టి సారిస్తోంది. ఇప్పటి వరకు బ్రోకర్లుగా గుర్తించిన రాజగోపాల్‌రెడ్డి, షేక్ రమేశ్‌లను అరెస్టు చేయగా మరో బ్రోకర్ రామకృష్ణను అదుపులోకి తీసుకుంది. అలాగే సబ్ బ్రోకర్లుగా పనిచేసిన 8 మందిని అదుపులోకి తీసుకొని నలుగుర్ని అరెస్టు చేసింది. వీరి కింద కొన్ని కాలేజీలు, ఇన్స్టిట్యూట్లకు చెందిన వారు, వాటి పీఆర్వోలు మైక్రో బ్రోకర్లుగా పనిచేసినట్లు సీఐడీ గుర్తించినట్లు సమాచారం. వారందరిని అదుపులోకి తీసుకోవాలని యోచిస్తోంది. దుబాయ్ పోలీసుల సహకారం కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న షేక్ నౌషాద్ అలీ, గుడ్డూ దుబాయ్‌కి పారిపోయినట్లు గుర్తించిన సీఐడీ.. వారిని పట్టుకునేందుకు అక్కడి పోలీసుల సహకారం తీసుకోనుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఈ లోపు నిందితులు దుబాయ్ నుంచి కూడా పారిపోయేందుకు ఆస్కారం ఉంటుందని సీఐడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓపక్క అధికారిక ఫార్మాలిటీస్‌కు సన్నాహాలు చేస్తూనే... మరోపక్క దుబాయ్‌కి వచ్చిన తమ బృందానికి సహకరించాల్సిందిగా అక్కడి అధికారులను కోరింది. రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయించినట్లు తెలిసింది. -
ఆ మంత్రులను తొలగించాలి: సీపీఎం
హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ నిర్ధారణ అయ్యాక కూడా మంత్రులు పదవుల్లో కొనసాగడం క్షంతవ్యం కాదని సీపీఎం పేర్కొంది. ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత మంత్రులను వెంటనే తొలగించాలని శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో విద్యార్థులు, తల్లితండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని మంత్రులు పదవుల నుంచి వైదొలగకుండా ఇంకా అంటిపెట్టుకుని ఉండడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ఎంసెట్-3కి గట్టి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఎంసెట్ లీకేజీలో కేటీఆర్ హస్తం: షబ్బీర్ ఆరోపణ
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో రాష్ట్రమంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఎంసెట్ రిజి స్ట్రేషన్లు, బయోమెట్రిక్ హాజరు, ఓఎంఆర్ షీట్ల ముద్రణ వంటి కాంట్రాక్టులన్నీ మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కంపెనీ మంత్రి కేటీఆర్ సన్నిహిత మిత్రునిది. జేఎన్టీయూ అధికారులు కూడా మాగ్నెటిక్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించినట్లు ఆయన గుర్తుచేశారు. -
ఎంసెట్ దోషులు తప్పించుకోలేరు : ఎమ్మెల్సీ కర్నె
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ కేసులో దోషులు ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకోలేరని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రతీ అంశాన్ని అంటగట్టి వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. శనివారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత పాలకులు పెంచి పోషించిన లీకేజీ మాఫియా అవశేషాలు ఇంకా వెంటాడుతున్న కారణంగానే ఎంసెట్-2 లీకేజీ జరిగిందని, దీనికి కాంగ్రెస్ కూడా కారణమేనని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. దోషులను కఠినంగా శిక్షించడానికి పీడీ చట్టం కింద కేసులు నమోదు చే యాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఎంసెట్ -2 లీకేజీ వ్యవహరానికి ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని మానుకోవాల ని కర్నె ప్రభాకర్ హితవు పలికారు. -
మంత్రులను వదిలి బ్రోకర్ల అరెస్టా?: నాగం
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో అసలు దోషులైన మంత్రులను వదిలిపెట్టి బ్రోకర్లను అరెస్టు చేయడం ద్వారా కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్ లీకేజీలో మంత్రులు, ఉన్నతాధికారులకు సంబంధముందని, మంత్రులది వందశాతం బాధ్యతని ఆరోపించారు. ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన ఎంసెట్ లో వైఫల్యం చెందడంతో రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందన్నారు. ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’లో భూసేకరణ జరపకుండానే కాంట్రాక్టులు ఇచ్చారని, కాంట్రాక్టర్లకు అనుకూలంగా సర్కారు వ్యవహరిస్తోందని నాగం ఆరోపించారు. -
లీకేజీ ఎన్నాళ్ల నుంచో బయటపడాలి : ఎంపీ వినోద్
కరీంనగర్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో బయటపడబోతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేనిది త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. -
కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలి : ఏబీవీపీ
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేసి ఎంసెట్-3ని నిర్వహిస్తామనడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. దోషులను వదిలేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యులను చేస్తూ.. విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కమిషనర్ రమణారావులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక మంత్రులు, వారి బంధువుల పాత్రపై కూపీ లాగి వారికి శిక్షపడే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మట్ట రాఘవేంద్ర, దిలీప్ నాయకులు జగన్, నర్సింహ, వేణు, ఎల్లస్వామి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
'లీకేజీ డొంక కదులుతోంది'
కరీంనగర్: ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి సాగుతోందో త్వరలోనే బయటపడనుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేని త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
రద్దుపై న్యాయ సలహా కోరిన సర్కారు!
న్యాయ నిపుణులతో సంప్రదింపులు హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో మళ్లీ పరీక్ష నిర్వహించాలా, లీకేజీకి బాధ్యులైన వారిని పక్కనపెట్టి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయ నిపుణుల ప్రాథమిక సూచనల మేరకు ఎంసెట్-2ను రద్దు చేయడమే పరిష్కారమని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నపత్రం ఒకరికి లీకైనా చట్ట ప్రకారం రద్దు చేయాల్సిందేనని అంటున్నాయి. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఎంసెట్-2 రద్దు చేయవద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏమిటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాల్‌ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం లీకయిందని నిర్ధారణ అయితే ఆ పరీక్ష రద్దు తప్పదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ చెప్పారు.‘‘మాల్‌ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లీకేజీ వ్యవహారాన్ని సానుభూతితో చూడలేం. రద్దు చేయక తప్పదు. లేకుంటే ప్రభుత్వం అందరికీ నచ్చే ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది..’’ అని మరో అధికారి పేర్కొన్నారు. ఏదేమైనా న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ‘ఎంసెట్-2 లీకేజీ కచ్చితంగా ప్రభుత్వానికి అప్రదిష్టే. దానికి సంబంధిత మంత్రులు, అధికారులు బాధ్యత వహించాల్సిందే. లేకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతుంది..’ అని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎంసెట్-3 నిర్వహించాల్సి వస్తే..: మెడికల్ ప్రవేశాల కోసం ఎంసెట్-3 నిర్వహించాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నత విద్యామండలికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ ప్రవేశాలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలన్నది ఎంసీఐ నిబంధన అని స్పష్టం చేశారు. ఎంసెట్-3 నిర్వహిస్తే ఆగస్టు నెలాఖరులోగా పరీక్ష పూర్తి చేసి ర్యాంకులు ప్రకటించాలి. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పది రోజులు పడుతుంది. తర్వాత మూడు విడతల కౌన్సెలింగ్‌కు మరో 20 రోజులు పడుతుంది. ఒకవేళ సమయం సరిపోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి మరో పది రోజులు అదనపు సమయం కోరాల్సి ఉంటుంది. -
లీకేజీ లోగుట్టు బయట పెట్టిందెవరు?
లీకేజీలో జేఎన్టీయూ పాత్ర? హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పక్షాన ఈ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్టీయూ (హెచ్) పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ మొదలుకుని పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు జేఎన్టీయూ కీలక పాత్ర పోషిస్తోంది. గత 15 ఏళ్లుగా ఈ ప్రవేశ పరీక్షను జేఎన్టీయూ నిర్వహిస్తుండటంతో.. ప్రశ్నపత్రాల ముద్రణ సమాచారాన్ని లీకేజీ ముఠా వర్సిటీ వర్గాల నుంచే రాబట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన జేఎన్టీయూ... పొరుగు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల ముద్రణకు ఆర్డర్ ఇస్తోంది. ముద్రణ సంస్థ వివరాలు ఎంసెట్ కన్వీనర్‌తోపాటు ఒకరిద్దరు ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశముంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఐదుగురు చొప్పున సీనియర్ లెక్చరర్లు పాలుపంచుకుంటారు. వీరు రూపొందించిన ప్రశ్నలను మిళితం చేసి ఎంసెట్ కన్వీనర్ పర్యవేక్షణలో మోడరేటర్లు..ప్రశ్నపత్రాలను 2 సెట్లుగా సిద్ధం చేస్తారు. 2 సెట్లకు సంబంధించిన ప్రశ్నలు లీక్ కావడంతో..ముద్రణసంస్థ ద్వారానే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ముద్రణ సంస్థ సమాచారం లీకేజీ ముఠాకు అందడంలో జేన్టీయూ సిబ్బంది వర్గాలు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎంసెట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బంది కాల్‌డేటాను సీఐడీ లోతుగా పరిశీలిస్తోంది. 1996లో జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కోచింగ్ సంస్థ కీలకపాత్ర పోషించింది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ఎంసెట్ కన్వీనర్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 1997లో జరి గిన ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రం.. కోల్‌కతా కు చెందిన ముద్రణ సంస్థ నుంచి లీక్ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అటు వర్సిటీ.. ఇటు ముద్రణ సంస్థ పాత్ర ఎంతనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత గోప్యంగా ప్రశ్నపత్రం తయారీ ఎంసెట్ ప్రశ్నపత్రాల తయారీ అత్యంత గోప్యంగా జరుగుతుందని, ప్రశ్నపత్రం తయారీలో పాలుపంచుకునే లెక్చరర్ల వివరాలు కేవలం ఎంసెట్ కన్వీనర్‌తో పాటు నిర్వహణ కమిటీలోని కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. లెక్చరర్లు తయారు చేసే ప్రశ్నపత్రాలు యథాతథంగా కాకుండా.. యాదృచ్ఛిక (ర్యాండమ్) పద్ధతిలో ఎంపిక చేసి కన్వీనర్ సమక్షంలో తుది ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. లీకేజీ ఘటన నేపథ్యంలో ప్రశ్నపత్రం తయారీలో భాగస్వాములైన లెక్చరర్లు, ఇతర సిబ్బంది నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరిస్తోంది. ముద్రణకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ వర్గాల నుంచి ముద్రణ సంస్థ వివరాలు తెలుసుకున్న లీకేజీ ముఠా.. అక్కడి సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలు సంపాదించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
ప్లీజ్.. మమ్మల్ని బలి చేయొద్దు
ఎంసెట్-2 ర్యాంకర్లు, తల్లిదండ్రుల గోడు హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహించనుందన్న వార్తలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారేమంటున్నారంటే.. మా అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్లాడు మా అబ్బాయి ఈ విషయం తెలిసినప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మళ్లీ పరీక్ష నిర్వహించినా తను రాయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ర్యాంక్ మళ్లీ వస్తుందనే గ్యారంటీ ఉండదు కదా? తప్పు చేసిన వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టి మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి. - రోహిణి, ఎంసెట్-2లో ఫస్ట్ ర్యాంకర్ ఉజ్వల్ తల్లి తప్పు చేసిన వారినే శిక్షించాలి ఎంసెట్-2లో తప్పు చేసిన వారికే శిక్ష పడాలి. రేరుుంబవళ్లు కష్టపడి పరీక్ష రాసిన నాలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. భవి ష్యత్తుపై ఎన్నో కలలతో ర్యాంకును సాధిం చాను. ఇప్పుడు ఇలా జరగడం బాధగా ఉంది. - కాసం ఐశ్వర్య, సెకండ్ ర్యాంకర్ వారికే పరీక్ష పెట్టాలి లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. దీంతో సంబంధం ఉన్న విద్యార్థులకు మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కష్టపడి చదివి రెండుసార్లు ఎంసెట్ రాశాం. చేతికి అందిన మెడికల్ సీటు చేయి జారి పోతుందంటే ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం. - జె.ప్రణవీరెడ్డి, 6వ ర్యాంకర్ మాకెందుకీ శిక్ష తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. కానీ ఏ తప్పు చేయని మాలాంటి వారికి నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. ఎంసెట్-2 రద్దు అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలి. - వినీత్‌రెడ్డి, 9వ ర్యాంకర్ మళ్లీ పరీక్ష వద్దే వద్దు మెడిసిన్‌లో సీటు కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి 18 వ ర్యాంకు సాధించాను. కొందరి కోసం అందరిని బలి చేయడం భావ్యం కాదు. ఎంసెట్-3 వద్దే వద్దు. - మాడూరి చైతన్య, 18వ ర్యాంకు ఎంసెట్టా..? యూనిట్ టెస్టులా? ఇప్పటికే తెలంగాణ, ఏపీ కలిపి 3 ఎంసెట్లు రాశాం. దీనికి అదనంగా నీట్ కూడా. ఏ కోర్సుకైనా ఒకేసారి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో ఇప్పటికే 2 నిర్వహించారు. మరోసారి నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇది ఎంసెట్టా..? లేక యూనిట్ టెస్ట్లా? అర్థం కావడం లేదు. - హేమ, 26వ ర్యాంక్, తార్నాక నిద్ర కూడా పట్టడం లేదు ఇప్పటికే రెండు సార్లు ఎంసెట్ రాశాం. మళ్లీ మూడోసారి పెడతాం.. రాయండి అంటే కష్టం. లీకేజీ వ్యవహారంతో నిద్ర కూడా పట్టడం లేదు. మళ్లీ పరీక్ష అంటే ఎంత టార్చర్ ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. - తనిష్ట్, 27వ ర్యాంక్ -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : చాడ
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎంసెట్‌ను మళ్లీ నిర్వహించే విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. జాతీయస్థాయి నీట్ పరీక్ష వ్యవహారంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభుత్వం చివరివరకు గందరగోళానికి గురిచేసిందని పేర్కొన్నారు. తాజాగా ఎంసెట్ పేపర్ లీకేజీ ఆందోళనను కలిగిస్తోందని పేర్కొన్నారు. -
ఎంసెట్ లీకేజీపై సర్కారు మల్లగుల్లాలు
-
ఎంసెట్ లీకేజీపై కేసు!
- పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నమోదు యోచనలో సీఐడీ - కాల్ రికార్డుల సేకరణ, అనుమానితుల కస్టడీ కోసం - కేసు నమోదు తప్పనిసరి! - బ్రోకర్ వెంకట్రావును విచారించాలని అధికారుల నిర్ణయం - క్షేత్రస్థాయిలో ప్రాథమిక దర్యాప్తు ముమ్మరం - బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు సాక్షి, హైదరాబాద్, పరకాల: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించింది. దాంతోపాటు ఫోన్ కాల్ రికార్డులను సంబంధిత కంపెనీల నుంచి తెప్పించుకోవాలంటే కేసు నమోదు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. దీంతో సోమవారం కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. వారి సంభాషణల కాల్ రికార్డులను సంబంధిత కంపెనీల నుంచి తెప్పించి, పరిశీలించాల్సి ఉందని సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రంగా మారిన వెంకట్రావు సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. జేఎన్టీయూ అధికారుల నుంచి ప్రశ్నపత్రం తయారీ, ఎంపిక, నిర్వహణలపై స్పష్టత తీసుకున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనలో భాగస్వామ్యం అయిన కమిటీ సభ్యులను పిలిచి ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అన్నింటికి కేంద్రంగా మారిన బ్రోకర్ వెంకట్రావు విషయాన్ని తేల్చితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఐడీ భావిస్తోంది. వెంకట్రావు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అంతగా భరోసా ఇవ్వడానికి గల కారణాన్ని తెలుసుకోవాలని నిర్ణయించింది. వెంకట్రావుకు ఎవరెవరితో సంబంధాలున్నాయనే అంశాన్ని వెలికి తీయాలంటే.. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించక తప్పదని సీఐడీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణ ముమ్మరం ప్రశ్నపత్రం లీకైనట్లు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు తల్లిదండ్రులకు సీఐడీ అధికారులు ఫోన్ చేసి సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ ప్రాంతాల్లో ఎంతమంది ర్యాంకుల్లో తేడాలు వచ్చాయో తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్న ఆధారాలేమిటనే ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ ఎంసెట్, ఎంసెట్-1, ఎంసెట్-2లలో వచ్చిన మార్కులు, ర్యాంకులు సహా వివరాలు తెలిపినట్లు తెలిసింది. మరోవైపు సీఐడీ విచారణ పేరుతో కాలయాపన చేస్తే ప్రత్యక్షంగా ఆందోళనకు సిద్ధం కావాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యోచిస్తున్నట్లు తెలుస్తోం ది. ఇందుకోసం విద్యార్థి సంఘాల మద్దతు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.