
ఆ మంత్రులను తొలగించాలి: సీపీఎం
ఎంసెట్ పేపర్ లీకేజీ నిర్ధారణ అయ్యాక కూడా మంత్రులు పదవుల్లో కొనసాగడం క్షంతవ్యం కాదని సీపీఎం పేర్కొంది.
హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ నిర్ధారణ అయ్యాక కూడా మంత్రులు పదవుల్లో కొనసాగడం క్షంతవ్యం కాదని సీపీఎం పేర్కొంది. ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత మంత్రులను వెంటనే తొలగించాలని శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీతో విద్యార్థులు, తల్లితండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని మంత్రులు పదవుల నుంచి వైదొలగకుండా ఇంకా అంటిపెట్టుకుని ఉండడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ఎంసెట్-3కి గట్టి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.