
ఎంసెట్ లీకేజీలో కేటీఆర్ హస్తం: షబ్బీర్ ఆరోపణ
ఎంసెట్ లీకేజీలో రాష్ట్రమంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో రాష్ట్రమంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఎంసెట్ రిజి స్ట్రేషన్లు, బయోమెట్రిక్ హాజరు, ఓఎంఆర్ షీట్ల ముద్రణ వంటి కాంట్రాక్టులన్నీ మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కంపెనీ మంత్రి కేటీఆర్ సన్నిహిత మిత్రునిది. జేఎన్‌టీయూ అధికారులు కూడా మాగ్నెటిక్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించినట్లు ఆయన గుర్తుచేశారు.