
నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. నార్త్ జోన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా నాయకుడు నైజీరియాకు చెందిన రెఫిల్తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్తోపాటు 5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
అలాగే 2 ల్యాప్టాప్లు, 15 సెల్ఫోన్లతోపాటు రూ. 33,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరికి సహకరిస్తున్న టోలిచౌకికి చెందిన మరో ఏడుగురి నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గోవా కేంద్రంగా ఈ మూఠా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పోలీసులు తెలిపారు.