ఫీజుల ఖరారు | Engineering colleges fees declared | Sakshi
Sakshi News home page

ఫీజుల ఖరారు

Published Tue, Jul 5 2016 2:34 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజుల ఖరారు - Sakshi

ఫీజుల ఖరారు

ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ధారించిన ఏఎఫ్‌ఆర్సీ
69 కాలేజీల్లో కనీస ఫీజు రూ. 35,000
అత్యధిక ఫీజు రూ. 1,13,500..
నాలుగు కాలేజీల్లో రూ.లక్షకు పైనే
సగటున రూ. 8 వేల వరకు పెరిగిన ఫీజులు
కాలేజీల వారీగా ఫీజుల వివరాలు
ఎంసెట్ వెబ్‌సైట్లో అందుబాటులోకి..

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) అందజేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు, చేర్పులతో ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం రాత్రే సంతకం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉత్తర్వుల కాపీ విడుదల కాలేదు. ఇది మంగళవారం ఉదయం అందుబాటులోకి రానుంది. కాలేజీల వారీగా ఫీజుల వివరాలను విద్యార్థులు ఎంసెట్ వెబ్‌సైట్ æ tseamcet.nic.in లో చూసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గరిష్ట ఫీజు 1,13,500 కాగా, కనీస ఫీజు 35,000గా ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును ఖరారు చేయగా.. 69 కాలేజీలకు కనీసఫీజు రూ.35 వేలుగా మాత్రమే నిర్ణయించింది.
 
 8 కాలేజీలకు రూ.35 వేల నుంచి రూ.39 ,000... 119 కాలేజీలకు రూ.40 వేల నుంచి రూ.59 వేల వరకు.. 17 కాలేజీలకు రూ.60 వేల నుంచి రూ.69,000.. 16 కాలేజీలకు రూ.70 వేల నుంచి రూ.79,000.. 5 కాలేజీలకు రూ.80 వేల నుంచి రూ.89,000.. 14 కాలేజీలకు రూ.90 వేల నుంచి రూ.99 వేల వరకు ఫీజు నిర్ణయించింది. ఈ ఫీజులు 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి.
 
 పెరిగిన ఫీజులు: కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా మిగతా కాలేజీల్లో ఫీజులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. కొన్ని కాలేజీల్లో మాత్రం రూ.30 వేల వరకు పెరిగింది. రాష్ట్రంలో సగటు ఫీజు రూ.49,768గా నిర్ణయించింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా.. ఈసారి 8 వేల వరకు పెరిగింది.
 
 కొన్ని ప్రధాన కాలేజీల్లో ఫీజులు
 కాలేజీ    ఫీజు
 సీబీఐటీ    1,13,500
 వాసవి    86,000
 ఎంవీఎస్‌ఆర్    95,000
 శ్రీనిధి    91,000
 గోకరాజు రంగరాజు    95,000
 సీవీఆర్    90,000
 మాతృశ్రీ    67,000
 ఎంజీఐటీ    1,00,000
 కేఎంఐటీ    77,000
 కిట్స్    1.05,000
 వర్ధమాన్    1.05,000
 బీవీఆర్‌ఐటీ    95,000
 మల్లారెడ్డి    78,000
 సీఎంఆర్    75,000
 అనురాగ్ గ్రూప్    93,000
 స్టాన్లీ    62,000
 వీఎన్‌ఆర్
 విజ్ఞాన్‌జ్యోతి      98,500
 విద్యాజ్యోతి    80,000
 వీబీఐటీ    67,000
 టీకేఆర్    57,000
 జి.నారాయణమ్మ    95,000
 గురునానక్    75,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement