ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య | Engineering student commits suicide | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Jan 5 2014 4:08 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఒంటికి నిప్పంటించుకొని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఛత్రినాక ఎస్సై శ్రీను కథనం ప్రకారం...

చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: ఒంటికి నిప్పంటించుకొని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఛత్రినాక ఎస్సై శ్రీను కథనం ప్రకారం... ఉప్పుగూడ జెండా ప్రాంతానికి చెందిన పెండెం శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె మంజు భార్గవి (20) బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది.

శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన భార్గవి రాత్రి 7.30కి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి రాత్రి 9.30 సమయంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. శ్రీనివాస్ కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసముంటుండగా... మొదటి, రెండు అంతస్తుల్లో ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంట్రింగ్ పని కోసం తీసుకొచ్చిన కిరోసిన్‌ను రెండో అంతస్తులో ఉంచారు. రాత్రి 11.30 సమయంలో భార్గవి రెండో అంతస్తులోకి వెళ్లి.. అక్కడ ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పటించుకుంది.

మంటల బాధను తాళలేక కేకలు వేస్తూ మొదటి అంతస్తులోకి వచ్చి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పైకి వెళ్లి చూడగా భార్గవి చనిపోయి కనిపించింది.  సమాచారం అందుకున్న పోలీసులు..  మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, భార్గవి ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తమకు తెలియడంలేదని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవి మృతి విషయం తెలిసి స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement