అక్రమ సంబంధంతోనే ఆ హత్య | extra-marital affair leads to murder | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధంతోనే ఆ హత్య

Published Mon, Jan 30 2017 5:44 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

extra-marital affair leads to murder

హైదరాబాద్‌సిటీ: కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలోని సమతానగర్లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఊబూతి శంకర్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించి టేకు మల్లేశం, భూషి మహిపాల్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. శంకర్‌ భార్యతో మల్లేశం కొంతకాలంగా వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. శంకర్‌ను అడ్డు తొలగిస్తే తన కార్యకలాపాలకు అడ్డు ఉండదని భావించి మల్లేశం ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇందుకు మహిపాల్‌ సహకారం తీసుకున్నాడని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement