
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు( కర్ణాటక): పర పురుషునితో సన్నిహితంగా ఉంటోందని భార్యను భర్త అంతమొందించాడు. ఈ ఘటన మైసూరు జయనగరలో జరిగింది. హతురాలు నళిని (32) కాగా, నిందితుడు ఆమె భర్త రాజేశ్ (40). రాజేష్ బైక్ మెకానిక్, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నళిని వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ఇది తగదని రాజేశ్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు.
ఆఖరికి రాజేశ్ రమాబాయి నగర నుంచి జయనగరకు మకాం మార్చాడు. అయినా పరిస్థితి ఏమీ మారలేదు. బుధవారం కూడా ఇదే విషయమై గొడవపడిన రాజేశ్ తాగిన మత్తులో భార్యను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు రాజేశ్ కోసం గాలించి పట్టుకున్నారు. హత్యపై అశోకపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment