రైలుకింద పడి చచ్చిపోతున్నాం
► స్నేహితుడికి ఫోన్ చేసిన బీటెక్ విద్యార్థులు
► ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కాచిగూడ: ‘మేమిద్దరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని ఇద్దరు బీటెక్ విద్యార్థులు తమ మిత్రుడికి ఫోన్‌చేసి ఎంఎంటీఎస్ రైలుకింద పడ్డారు. ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ నిరంజన్ నాయక్ తెలిపిన మేరకు.. కోఠి ఇసామియా బజార్ ప్రాంతానికి చెందిన అదిరే యాదగిరి కుమారుడు అదిరే రాజ్‌కుమార్ (20) ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. రాజ్‌కుమార్ అదే కాలేజీలో చదువుతున్న తన స్నేహితుడు రవితో మలక్‌పేట – డబీర్‌పుర రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా రవి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవి మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయే ముందు కోఠి ఇసామియాబజార్ ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు వినయ్‌కి ఫోన్‌చేసి తాము ఇద్దరం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ పెట్టాశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహరమే రాజ్‌కుమార్ మరణానికి కారణమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ రవి వివరాలు తెలియాల్సి ఉంది.