మహిళా సెక్యూరిటీ గార్డు అదృశ్యం | female security guard missing | Sakshi
Sakshi News home page

మహిళా సెక్యూరిటీ గార్డు అదృశ్యం

Published Mon, Jun 13 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

female security guard missing

బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని బ్రాండ్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న కె.రమాదేవి(23) ఈ నెల 6వ తేదీన ఉదయం విధులకు హాజరయింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా రాత్రి అయినా రాలేదు. దీంతో భర్త కె.శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన చెందిన అన్ని ప్రాంతాలు గాలించారు. ఆమె ఆచూకీ దొరక్కపోవటంతో బంజారాహిల్స్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement