బంజారాహిల్స్ : కిరాణాషాపుకు వెళ్లి సరుకులు తీసుకొస్తానని వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో ఆ బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్ నగర్‌లో నివసించే వెంకటలక్ష్మి కూతురు కె.నందిని(14)కి ఈ నెల 23న కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తీసుకురావాల్సిందిగా చెప్పింది. తల్లి మాట విని బయటకు వెళ్లిన నందిని ఎంతకూ తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా, చుట్టాల ఇళ్లల్లో కనుక్కున్నా నందిని ఆచూకీ తెలియకపోవడంతో తల్లి నందిని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.