సికింద్రాబాద్లోని హోటల్లో అగ్నిప్రమాదం | fire accident in hotel in secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్లోని హోటల్లో అగ్నిప్రమాదం

Published Wed, Jul 13 2016 6:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in hotel in secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

ఈ అగ్నిప్రమాదంలో హోటల్ పక్కనే ఉన్న రెండు దుకాణాలు కూడా తగలబడ్డాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement