సికింద్రాబాద్ కార్ఖానాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలోని పూజ ప్లాజా దుకాణ సముదాయంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటాన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్‌లు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.