
ఐదుగురు తమిళ సినీ ఆర్టిస్టులు అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌంట్ ఒపేరాలోని 103 కాటేజ్‌పై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన శాపపురం(తమిళం)సినిమా షూటింగ్ యూనిట్‌కు చెందిన వారిగా గుర్తించారు. కాగా పేకాటాడుతూ పట్టుబడిన వారిని విడిపించడం కోసం ఓ యువ హీరో పోలీసులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.