అనారోగ్యాల పాలు కాకూడదంటే ఆహారం విషపూరితం కాకుండా నివారించుకోండి. సంక్రాంతి పండుగ పిండి వంటలు సిద్ధమవుతున్నాయి.
హైదరాబాద్: అనారోగ్యాల పాలు కాకూడదంటే ఆహారం విషపూరితం కాకుండా నివారించుకోండి. సంక్రాంతి పండుగ పిండి వంటలు సిద్ధమవుతున్నాయి. వంటగదికి కొత్త సామగ్రి వస్తోంది. చక్కిలాలు, నువ్వుల అప్పాలు, కట్టె అప్పాలు, మురుకులు వంటి ఎన్నో వంటకా లు తయారవుతున్నాయి. కానీ పరిశుభ్రంగా లేకపోతే ఆహారం విషపూరితమవుతుంది. ఆహారం విషపూరితం కావడానికి కారణం మురికిగా ఉండే చేతులు, మురికి నీరు మాత్రమే కాదు అపరిశుభ్రమైన వంట గది కూడా కారణమే. వంట గది శుభ్రంగా లేకపోతే బొద్దింకలు వస్తాయి. నీటి పైపులు, మురికినీటి కాలువల ద్వారా హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాను మోసుకువస్తాయి.
ఆహారాన్ని, వంట పాత్రలను కలుషితం చేస్తాయి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే... ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వంటగదిలో క్రిమిసంహారక మందులు వేయండి. బొద్దింకలను చంపేయండి. బొద్దింకలు లేకపోతే ఆహారం విషపూరితం కాదు. దాంతో మీ పండుగ ఉత్సవాలు ఆరోగ్యవంతంగా, ఆనందభరితంగా ఉంటాయి. ఈ సంక్రాంతి నాడు విషపూరితం అవుతుందనే భయం లేకుండా రుచికరమైన ఆహారాన్ని ఇష్టంగా తినేయండి.