పాత జిల్లాల ప్రాతిపదికన రూ.50 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: మంత్రులకు రూ.5 కోట్ల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పది జిల్లాల ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులకు అదనంగా ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది.
రూ.5 కోట్ల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ఈ మేరకు రూ.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతమున్న 31 జిల్లాలకు బదులుగా పది పాత జిల్లాల ప్రాతిపదికన ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించినట్లు ఇందులో స్పష్టం చేశారు.
మంత్రులకు రూ.5 కోట్ల చొప్పున నిధులు
Published Tue, Apr 18 2017 2:33 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement