రిపోర్టర్ అవుదామనుకున్నా...
రిపోర్టర్ అవుదామనుకున్నా...
Published Thu, Jan 21 2016 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
డాక్టర్ ని కాబోయి యాక్టర్ నయ్యానని కొందరు సినీ తారలు చెబుతుంటారు. ఇక్కడ మాత్రం రిపోర్టర్ ను అవుదామనుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు.. బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి. ఆమెకు జర్నలిజం అంటే మక్కువ. అందుకే ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం జర్నలిజంలో డిప్లొమా కూడా చేశారు. రిపోర్టర్ గా ప్రజా సమస్యలు వెలికితీసి వాటిని వెలుగులోకి తెచ్చి పరిష్కరించవచ్చని భావించి పాతికేళ్ళ క్రితం ఓ పత్రికలో చేరారు.
సరిగ్గా జర్నలిస్ట్ గా రాణిస్తున్న సమయంలో పెళ్లి కావడంతో ఈ వృత్తికి దూరమైనట్టు ఆమె తెలిపారు. పత్రికల్లో కాలమ్స్ రాయడం ఇష్టమన్నారు. ఇప్పటికీ రిపోర్టర్ గా ఉంటే బాగుండేదని అనుకుంటానని చెప్పారు. సమాజంలో కుళ్లును బయటకు తీయాలన్నా, ప్రజలను చెతన్యవంతులను చేయాలన్నా జర్నలిజమే చక్కని వేదికని అభిప్రాయపడ్డారు. తన తండ్రి కేకే జర్నలిస్ట్ కావడంతో ఆ ప్రభావం తనపై పడిందన్నారు. అయితే ప్రజాసేవకు రిపోర్టర్ గా బాధ్యత ఎలా ఉంటుంది.. రాజకీయ నేతగా కూడా ఆ బాధ్యతను నెరవేర్చవచ్చని తెలిపారు.
- బంజారాహిల్స్
Advertisement