స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ విధానంపై సర్కార్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయపోస్టుల భర్తీకి అమలు చేయాల్సిన పరీక్షకు సంబంధించి స్కీం అండ్ సిలబస్ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పరీక్ష స్కీంను తెలియజేయాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, పరీక్ష విధానం ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ప్రభుత్వం పరీక్ష విధానాన్ని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా సిలబస్‌ను తాము ఇస్తామని విద్యా శాఖ ప్రభుత్వానికి తెలియ జేసినట్లు తెలిసింది.
3 నెలల్లో కష్టమే!
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ని 3 నెలల్లో పూర్తి చేయా లని ఇటీవల సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చిన నేపథ్యంలో విద్యా శాఖ కసరత్తు ప్రారంభిం చింది. ముందుగా సిలబ స్‌పై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు నియామకాలను 3నెలల్లో పూర్తి చేయడం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు చెబు తున్నాయి. దీంతోపాటు వి ద్యార్థులకు పరీక్షకు సిద్ధం అయ్యేందుకు మరో మూడు నెలల సమయం ఇచ్చి పరీక్షను నిర్వహిం చాలన్న ఆలోచన చేస్తోంది. మొత్తంగా ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
‘స్కీం అండ్ సిలబస్’పై దృష్టి
Published Thu, Mar 30 2017 12:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement