చెత్త ఉద్యోగాలకు ఇంజనీర్లా!
⇒ దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థ తప్పుదారిన పయనిస్తోంది
⇒ విజ్ఞానానికి నైపుణ్యం తోడైతేనే మెరుగైన కెరీర్ అవకాశాలు
⇒ ‘టాలెంట్ స్ప్రింట్’ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ‘‘చెత్త ఉద్యోగాలకు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేస్తుండటం దురదృష్టకరం. కంపెనీల అవ సరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్లలో విజ్ఞానం కొరవడటంతో ఇంటర్వూ్యలను ఎదుర్కోలేకపోతున్నారు. విద్యాబోధనలో నాణ్యత లేనందున ఏటా వేలాది మంది గ్రాడ్యుయేట్లు జీరో నాలెడ్జ్ తోనే బయటకు వస్తున్నారు. దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థ తప్పుదారిలో పయనిస్తోంది. దీనిలో మార్పు లు తీసుకురావాల్సిన అవసరమేర్పడిం ది’’అని గవర్నర్ నరసింహన్ అన్నారు.
‘టాలెంట్ స్ప్రింట్’సంస్థ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి సంస్థ)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లా డుతూ.. డిజిటల్ ప్రపంచంలోకి వెళుతున్న మనం మేధాశక్తిని వినియోగించడం మానేసి మెషీన్లుగా మారిపోతున్నామన్నారు. విద్యా ర్థులకు గ్యాడ్జెట్లను అందించడం వల్ల చేతి రాత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతను కోల్పో తున్నారన్నారు. పాతరోజుల్లో ఎక్కాలను, ఉపనిషత్తులను జ్ఞాపకం ఉంచుకునేవార మని, నేటి తరం వారు కూడికలకు కూడా కాలుక్యులేటర్లను వినియోగిస్తున్నారన్నారు.
నగరానికి ‘ఎన్‌పీసీఐ’సముదాయం
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (ఎన్‌పీసీఐ) అతిపెద్ద సముదాయాన్ని త్వరలో హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణ యించినట్లు ఆ సంస్థ చైర్మన్ బాలచంద్రన్ తెలిపారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేయబో తున్న ఎన్‌పీసీఐ ప్రాంగణంలో సంస్థ కార్యక లాపాలతో పాటు పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనుందన్నారు. కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యు యేట్లకు, ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్యకు ఎంతో వ్యత్యాసం ఉంటోంద న్నారు. నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపు ణ్యాలను అందించేందుకు ప్రభుత్వం టాస్క్ ను ఏర్పాటు చేసిందని, టాస్క్ ద్వారా మరిన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమా లను అందించేందుకు టాలెంట్ స్ప్రింట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. జాతీ య స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మనీష్ కుమార్ మాట్లాడుతూ.. టాలెంట్ స్ప్రింట్ ప్రవేశపెడుతున్న యూత్ కెరీర్ ద్వారా ఉద్యోగార్థులకు వ్యక్తిగత అధ్యయన అనుభవాన్ని అందించడంతో పాటు నైపు ణ్యాలను సాధించాలనుకునే వారిని ఆశా జనకంగా తయారు చేస్తుందన్నారు. కొత్త క్యాంపస్ ద్వారా పదేళ్లలో పది లక్షల మంది ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, కొలువులను సాధించేందుకు సహాయపడతామని టాలెం ట్ స్ప్రింట్ సీఈవో శంతన్‌పాల్ అన్నారు.
ఏది కావాలన్నా గూగుల్‌లో వెతికే పరిస్థితి..
ఏదైనా సమాచారం కావాలంటే ఠక్కున గూగుల్‌లో వెతుకుతున్న పరిస్థితి కనిపి స్తోందని, ప్రతి దానికి టెక్నాలజీపై ఆధారపడటం భారతీయ సంస్కృతి కాదని నరసింహన్ అన్నారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన తరగతి గదిలో నాణ్యమైన విద్యాబోధన ఉండటం లేదన్నారు. విజ్ఞానానికి నైపుణ్యం తోడైతేనే మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించేందుకు టాలెంట్ స్ప్రింట్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఐటీ, ఐటీయేతర రంగాల ఉద్యోగులకు రీస్కిల్లింగ్ శిక్షణ ఇస్తున్న సంస్థలు, మంత్రులు, అధికారులకు కూడా శిక్షణ రీస్కిల్లింగ్ ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు.