సామాన్యుడిలా అధికారులకు గవర్నర్ ఫిర్యాదు | governor narasimhan complaints to GHMC as a citizen over trees collapse | Sakshi
Sakshi News home page

సామాన్యుడిలా అధికారులకు గవర్నర్ ఫిర్యాదు

Published Sat, May 21 2016 4:54 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

సామాన్యుడిలా అధికారులకు గవర్నర్ ఫిర్యాదు - Sakshi

సామాన్యుడిలా అధికారులకు గవర్నర్ ఫిర్యాదు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్ భవన్లో ఎప్పుడూ అధికారులు, నాయకులతో బిజీగా ఉండే నరసింహన్ ఒక్కసారిగా సామాన్యుడి అవతారమెత్తారు. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ నంబర్కు శనివారం ఆయన స్వయంగా ఫోన్ చేసి సామాన్య పౌరుడిలా ఫిర్యాదు చేశారు.

నగరంలో శుక్రవారం కురిసిన భారీగా గాలులకు రాజ్ భవన్ రోడ్డులో చెట్లు కూలి అసౌకర్యంగా ఉందంటూ నరసింహన్ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి కూలి పోయిన చెట్లను తొలగించారు. తానూ సామాన్య పౌరుడిలా ఫోన్ చేసినా వెంటనే సిబ్బంది స్పందించారంటూ తిరిగి నరసింహన్ ఎమర్జెన్సీ నంబర్కు ఫోన్ చేసి అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement