పార్కింగ్ చార్జీల రద్దు 28 వరకు పొడిగింపు
శంషాబాద్ : చిల్లర కొరత కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల పార్కింగ్ చార్జీల రద్దు గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఈ నెల 14 నుంచి పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం లేదు. చిల్లర పరిస్థితి అదే విధంగా ఉండడంతో ప్రభుత్వం ఈ నెల 28 వరకు పార్కింగ్ చార్జీలను రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి ఎలాంటి పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం లేదని జీఎంఆర్ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి.