
గ్రూప్-2 పరీక్ష నేడే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్ష కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
సిటీబ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్ష కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం జరిగే ఈ పరీక్ష కోసం ఆయా కేంద్రాల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, సిబ్బందిని నియమించారు. కేంద్రాల పర్యవేక్షణ కోసం అవసరమైన సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 1000 సిటీ బస్సులు నడపనున్నారు.
హైదరాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు: 263
హాజరు కానున్న అభ్యర్థులు: 1,15,968
పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లు: 268
పరీక్ష షెడ్యూలు
పరీక్ష కేంద్రంలోకి అనుమతించే సమయం: ఉదయం 8.45
కేంద్ర ద్వారాలు మూసివేత: 9.45
10 నుంచి 12.30 వరకు పరీక్ష మధ్యాహ్నం కేంద్రంలోకి అనుమతించే సమయం: 1.15
పరీక్ష కేంద్ర ద్వారాలు మూసివేత: 2.15
2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష
ఒక పరీక్షకు హాజరు కాకపోతే మరొక పరీక్షకు అనుమతించరు.
ప్రధాన సూచనలు..
టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్‌సల్లో ఏదైనా ఒక ఓరిజినల్ కార్డును తప్పని సరిగా తీసుకురావాలి. ఓఎంఆర్ అన్సర్ షీట్ల బబ్లింగ్ కోసం బ్లూ/బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్ను మాత్రమే వాడాలి. వేరే రంగు పెన్నుతో బబ్లింగ్ చేస్తే జవాబు పత్రాలు ఇన్‌వ్యాలిడ్ అవుతారుు.
ఇవి అనుమతించరు: మొబైల్ ఫోన్లు, ట్యూబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు, చేతి బ్యాగులు, లాగ్ బుక్స్, చార్టులు, కాగితాలు, పరికరాలు ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లు.. బూట్లు, ఆభరణాలు, నగలు ధరించరాదు. అభ్యర్థుల చేతికి మొహందీ పెట్టుకోవద్దు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థి ఫొటోతో పాటు వేలిముద్రలను సేకరిస్తారు. ప్రతి అభ్యర్థి ఫొటోల గుర్తింపు ప్రక్రియ ఉంటుంది.
విద్యాసంస్థలకు 12న సెలవు
గ్రూప్-2 పరీక్షల కోసం ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఈనెల 11,13 తేదీల్లో సెలవు ప్రకటించారు. కాగా ఈ విద్యాసంస్థలకు 12న కూడా సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు.