ఎంఫిల్, పీహెచ్‌డీ సీట్ల భర్తీ విధానం చెప్పండి | high court orders HCU to give seat allotment details | Sakshi
Sakshi News home page

ఎంఫిల్, పీహెచ్‌డీ సీట్ల భర్తీ విధానం చెప్పండి

Published Thu, Aug 17 2017 3:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

high court orders HCU to give seat allotment details

హెచ్‌సీయూకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఎంఫిల్, పీహెచ్‌డీ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న విధా నాన్ని తెలియజేయాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఆదేశించారు. పీహెచ్‌డీ, ఎంఫిల్‌ సీట్ల భర్తీ ప్రక్రియల వాటిæ సంఖ్యను కుదించడాన్ని సవాల్‌ చేస్తూ ఎస్‌.మున్నా అనే విద్యార్థి వేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి విచారించారు.

పాత–కొత్త విధానాల్లో ఏయే కేటగిరీలకు ఎన్ని సీట్లు ఉంటాయో వివరి స్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రిజిస్రా ్టర్‌ను ఆదేశించారు. సీట్ల సంఖ్యను ఖరారు చేశాక వాటిని కుదించాలనే విధానం సబబు గా లేదని, విద్యార్థులకు వర్సిటీ తప్పుడు సంకేతాలను ఇచ్చినట్లు అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీట్ల సంఖ్యను తగ్గించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదించారు. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement