బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి
బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి
Published Wed, Sep 21 2016 3:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. తారకంకు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో తారకం కుటుంబ సభ్యులు, తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు తారకం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని ఏసీజే అన్నారు. తారకం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement