100 మండలాల్లో అధిక వర్షపాతం | High rainfall in 100 mondals | Sakshi
Sakshi News home page

100 మండలాల్లో అధిక వర్షపాతం

Published Wed, Aug 30 2017 5:09 AM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM

High rainfall in 100 mondals

నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ నుంచి ఇప్పటివరకు వంద మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపి నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ సీజన్‌ మధ్యలో డ్రైస్పెల్‌ కారణంగా 174 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం, 310 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణంగా సరాసరి 56.8 సెం.మీ. వర్ష పాతానికి 52.1సెం.మీ. నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఏకంగా 40 శాతం లోటు రికార్డయింది. ఈ నెలలో ఇప్పటివరకు 6 శాతం లోటు నమోదైంది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు స్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. గడిచిన 24 గంటల్లో దామరగిద్దలో అత్యధికంగా 7 సెం.మీ. వర్షం కురిసింది. కోయిదా, జడ్చెర్ల, మహబూబ్‌నగర్‌లలో 6 సెం.మీ., మక్తల్, రుద్రూరు, మద్నూరు, నారాయణపేట్‌లలో 5సెం.మీ., ఎల్లారెడ్డి, అశ్వారావుపేట, పినపాక, మొగుళ్లపల్లి, గండీడ్‌ 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement