15 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు | highcourt dasara holidays starts from 15 | Sakshi
Sakshi News home page

15 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు

Published Wed, Oct 14 2015 11:09 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

15 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు - Sakshi

15 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 24న మెహరం కావడంతో హైకోర్టుకు సెలవు. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలు ఈ నెల 26 నుంచి పునః ప్రారంభం అవుతాయి. ఈ నెల 19న వెకేషన్ కోర్టు అత్యవసర కేసులను విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తారు.

సెలవుల్లో అత్యవసర కేసులను దాఖలు చేయదలచిన వారు ఈ నెల 16న వాటిని దాఖలు చేయాల్సింది. అలా దాఖలు చేసిన పిటిషన్లను 19న వెకేషన్ కోర్టు విచారిస్తుందని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement