హైకోర్టుకు దసరా సెలవులు | Dasara hoilydays to Joint state high courts till october 1 | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు దసరా సెలవులు

Published Sun, Sep 28 2014 4:25 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Dasara hoilydays to Joint state high courts till october 1

సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు గుండా చంద్రయ్య, ఎం.ఎస్.కె.జైశ్వాల్, సి.ప్రవీణ్‌కుమార్‌లు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తారు. వెకేషన్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే కక్షిదారులు ఈ నెల 29న దాఖలు చేయాల్సి ఉంటుంది. వీటిని 1వ తేదీన వెకేషన్ జడ్జీలు విచారిస్తారు. జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ జైశ్వాల్‌లు ధర్మాసనంలో ఉంటే, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement