సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అత్యవసర కేసుల వారు 25న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై కోర్టు 27న విచారణ జరుపుతుంది. న్యాయమూర్తులు జస్టిస్ బి.శివశంకరరావు, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం కేసులను విచారిస్తుంది. సింగిల్‌గా జస్టిస్ ఎం.సీతారామమూర్తి విచారణ జరుపుతారు. సెలవుల అనంతరం అక్టోబర్ 3న కోర్టు పునఃప్రారంభమవుతుందని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.