మండే ఎండ
ఆరేళ్ల తరవాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రత
41.4 డిగ్రీలుగా నమోదు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ఆరేళ్ల తరువాత సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్‌లో 2010 ఏప్రిల్ 16న42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్ తొలివారంలోనే (సోమవారం) 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదైనఅత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.7 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 24 శాతానికి పడిపోయింది.
మధ్యాహ్న వేళల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు ఎండ తీవ్రతకు అవస్థలు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.