ఏజెన్సీ ఏరియాలపై రాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ ఫోరం లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకు కనీస ఆరోగ్య రక్షణ కూడా లేదని హ్యూమన్ రైట్స్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మంలోని భద్రాచలం, విశాఖలోని ఏజెన్సీల్లో మలేరియా, రక్తహీనత, ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు ప్రజలను హరింపజేస్తున్నాయని ఫోరం ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్టు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జీవన్ కుమార్, భుజంగరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూర్‌లోని బీముగూడలో 16 కుటుంబాలు అంతుచిక్కని చర్మ వ్యాధులతో 6 నెలలుగా బాధపడుతున్నా యని, ఏపీలోని సీతంపేట్ ఏజెన్సీలో ఆదివాసీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల 1999లో 5 వేల మంది, 2005, 2010ల్లో 2,500 మంది చొప్పున మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు.
ఆదివాసీల ఆరోగ్యంపై చర్యలు తీసుకోండి
Published Thu, Jan 5 2017 2:54 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement