హైదరాబాద్ నుంచి చెన్నైకి రెండు ప్రత్యేక రైళ్లు
Published Sat, Dec 5 2015 6:30 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: భారీ వర్షాలు కురిసి చెన్నైలో వరదలు సంభవించి రద్దయిన రైళ్ల రాకపోకల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్కు రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ బయలుదేరనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రెండో ట్రైన్ సర్వీసు శనివారం రాత్రి 9 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జంక్షన్ నుంచి బయలుదేరనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement