
బండ్ల గణేశ్ చంపేస్తానంటున్నాడు...
సినీ నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తులసి ధర్మచరణ్ అనే విత్తనాల వ్యాపారి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశాడు.
నిర్మాత బండ్ల గణేశ్‌పై ఏసీపీకి ఫిర్యాదు
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తులసి ధర్మచరణ్ అనే విత్తనాల వ్యాపారి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. గబ్బర్‌సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని రూ. 80 లక్షలు తీసుకున్న గణేశ్.. ఆ హక్కులను రూ. 4 కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించడాని బాధితుడు తెలిపాడు. ఈ విషయంపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు పెట్టినందుకు సోమవారం రాత్రి నుంచి గణేశ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి ముంబై మాఫియాతో చంపించేస్తానని హెచ్చరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
తనకు రావాల్సిన డబ్బు గురించి అ ప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, కన్నా ఫణిల వద్ద పలుమార్లు సమావేశాలు జరిగాయని, అయినా డబ్బు ఇవ్వలేదని ధర్మచరణ్ తెలిపాడు. రెండు నెలల క్రితం మంత్రులు నాయిని, కేటీఆర్‌తో పాటు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వద్ద కూడా సమావేశం జ రిగిందని, వారు కూడా డబ్బులు ఇవ్వాలని గణేష్‌కు చెప్పినా పట్టించుకోకుండా తనను లేపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించా డు. గణేశ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు.