
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీఫ్ ఫెస్టివల్‌పై కోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
గురువారం ఉదయం 8 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహిస్తున్న గోపూజ కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద హాజరవుతారని తెలిపారు. బీఫ్ ఫెస్టివల్ జరిపితే మాత్రం దాన్ని అడ్డుకుని తీరుతామని రాజాసింగ్ పేర్కొన్నారు.