ఉద్యోగం కావాలా... పోస్టాఫీసుకు వెళ్లండి..!
- నేషనల్ కెరీర్ సర్వీస్‌తో తపాలా కార్యాలయాల అనుసంధానం
- జాబ్‌మేళాలతో అభ్యర్థుల ముంగిటకే ఉద్యోగాలు
- ప్రయోగాత్మకంగా హైదరాబాద్ కార్యాలయాల్లో నిర్వహణ
- నేడు పోస్టల్–కార్మిక ఉపాధి శాఖల మధ్య ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తమకు కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులను నేరుగా ఎంపిక చేసుకోవటానికి ఆయా సంస్థలు విద్యార్థుల వద్దకే వెళ్లి క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఉద్యోగం కోసం యువకులు ఎంప్లాయి మెంట్ ఎక్సే్చంజీల్లో వివరాలు నమోదు చేసుకుం టే సంస్థలే వారి చెంతకు వస్తే ఎలా ఉంటుం ది...? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే తరహా విధానానికి శ్రీకారం చుడుతోంది. దీనికి తపాలా కార్యాలయాలు కీలకంగా మారుతున్నాయి.
ఎన్‌సీఎస్‌తో తపాలా కార్యాలయాల అనుసంధానం..
ఇప్పటి వరకు నిరుద్యోగ యువత ఎంప్లాయి మెంట్ ఎక్సే్చంజీల్లో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. పదో తరగతి పూర్తయింది మొదలు వివిధ దశల్లో చదువు పూర్తి చేసుకున్నవారు వీటిల్లో వివరాలు నమోదు చేసు కోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని ద్వారా ఉద్యోగావకాశాలు కలిగేదీ, లేనిదీ ఎవరికీ సమాచారం ఉండదు. కానీ దీన్ని పూర్తిగా మారు స్తూ నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్) పథకాన్ని కేంద్రంఅందుబాటులోకి తెచ్చిన విషయం తెలి సిందే. ఇప్పుడు దీన్ని తపాలా కార్యాలయాలతో అనుసంధానిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తా త్రేయ, భారత తపాలా శాఖ కార్యదర్శి బి.వి. సుధాకర్ సమక్షంలో 2 శాఖలు ఆదివారం ఉద యం హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యా లయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకో ను న్నాయి. కాగా, దీన్ని ప్రయోగాత్మకంగా హైదరా బాద్ నుంచి ప్రారంభిస్తుం డటం మరో విశేషం.
ఏం చేస్తారు...
ఉద్యోగార్థులు తమ వివరాలను సమీపంలోని ఎన్‌సీఎస్ సెంటర్స్ ఉన్న తపాలా కార్యాలయా లకు వెళ్లి అక్కడి కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే వాటిని పొందుప రుచుకునే వెసులుబాటు ఉంటుంది. నమోదైన వివరాలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరుతా యి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం అవి జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. అక్కడ నేరుగా ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వూ్య చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, తపాలాశాఖలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.
అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ...
కేవలం ఉద్యోగావకాశాలే కాకుండా అవసరమైన మెరుగైన ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా అభ్యర్థుల ముంగిటకు రాబోతున్నాయి. దీంతో వారి నైపుణ్యం మెరుగుపడి మరింత ఉన్నత ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదం చేయనుంది.