
భారతీయ సంస్కృతి గొప్పది
భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌కోవా పేర్కొన్నారు.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్‌కోవా
హైదరాబాద్: భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌కోవా పేర్కొన్నారు. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను చిన్నచూపు చూడొద్దని, వేషధారణ చూసి అక్కడి ప్రజలను చైనీయులుగా చూడటం సరికాదన్నారు. ధనమే కేంద్రబిందువుగా ప్రస్తుత సమాజం నడుస్తోందని, దీంతో కుటుంబ, మానవ విలువలు నశిస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజ అభివృద్ధిలో ప్రజలు పాలుపంచుకోవాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు, సన్‌షైన్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ నాగరాజు, టీవీ నారాయణరావు, హర్షిత హాస్పిటల్ ఎండీ డాక్టర్ కృష్ణ ప్రశాంతికి ఉద్యోగ భారతి పురస్కారాలు, శేఖర్‌రెడ్డి (రియల్ ఎస్టేట్), పాలపర్తి సంధ్యారాణి (సాహిత్యం), వెంకట్ (ఫైన్ ఆర్ట్స్), రాంబాబు (సామాజికవేత్త), నర్సింహమూర్తి (వాస్తు పండితులు), హరిప్రసాద్, హరిత (మీడియా)కు విశ్వ ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు.